ఐటీ అంతిమ లక్ష్యం బాబేనా..??

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాలో నేతలకి ఇప్పుడు హైపర్ టెన్షన్ తెప్పిస్తున్న ఏకైక అంశం ఐటీ దాడులు..తెలంగాణా రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి పైన మాత్రమే జరిగిన ఈ దాడులు తరువాత ఏపీలో టీడీపీ నేతల ఆస్తులపై అదే ఊపుగా వారి సంభందిత కంపెనీలపై ఏకకాలంలో జరిగాయి..అయితే ఈ ఆపరేషన్ అంతా ఎంతో వ్యూహాత్మకంగా పకడ్బందీగా జరుగుతోందనేది అక్షర సత్యం..అంతేకాదు ఈ దాడుల వైనం పరిశీలిస్తే ఇదేదో అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తున్నట్టుగా లేదు..రెండు మూడు నెలల ముందుగానే ఈ దాడులకి వ్యుహరచనలు జరిగాయని తెలుస్తోంది.

అయితే ఈ దాడులతో యావత్ తెలుగుదేశం పార్టీ నేతలు..అదేవిధంగా చంద్రబాబు కోటరీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు..ఈ దాడుల మూలంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని ఆర్ధికంగా దెబ్బకొట్టడం వలన వచ్చే ఎన్నికల్లో టీడీపీ హవాని తగ్గించడమే కాకుండా పార్టీలో కీలక నేతలకి అభద్రతా భావం కలిగించి ఆ తరువాత వారిని పార్టీకి దూరం చేయాలనేది వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది..

ఆర్ధిక భారం కలుగ చేసి చంద్రబాబు చుట్టూ ఉన్న ఆర్ధిక మద్దతు దారులని చిన్నాభిన్నం చేయడమే కేంద్రం వ్యూహంగా అందరికి అర్థమవుతోంది..ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఇదంతా జస్ట్ ఎదో సాంపిల్ గా జరిగిన తంతని అసలు సినిమా ముందు ముందు ఉంటుందని అంటున్నారట..అసలు ఈ దాడుల అంతిమ లక్ష్యం చంద్రబాబు అనే విషయం అందరికి తెలిసిందే..ముందుగా టీడీపీ నేత బీద మస్తాన్‌రావుపై జరిపిన ఐటీ దాడి అట్నించటు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది.

అక్కడితో ఆగకుండా సీఎం రమేశ్‌ కి కూడా ఐటీ ముసుగులో కేంద్రం తన సత్తా ఏమిటిలో చూపించింది..అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే..ఏమి స్వాధీనం చేసుకుంటున్నారు.. అనే విషయాలపై అధికారులు మాత్రం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు..గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్దిక బలంగా నిలిచిన వారినే టార్గెట్ గా పెట్టుకుంది ఆర్థికంగా అండగా ఉన్న వారు…ఈ ఎన్నికల్లో సహకారం అందించే అవకాశమున్న వారితో ‘హిట్‌ లిస్ట్‌’ తయారైనట్లు సమాచారం.

అయితే ఆయా కంపెనీలకు చెందిన సమస్త సమాచారాన్ని ఐటీ శాఖ ముందుగానే తెప్పించుకున్నట్లు తెలిసింది…అయితే ఈ దాడులు ఎప్పుడు జరగాలి ఎవరెవరిపై జరగాలి అనే విషయంపైముందుగానే పక్కా సమాచారంతో దాడులు జరిగాయని అంటున్నారు విశ్లేషకులు…ఈ దాడుల కి బీజం పడింది మాత్రం కర్ణాటక ఎన్నికల నాటినుంచే నని టాక్ వినిపిస్తోంది..ఇక చిట్టచివరిగా ఐటీ దాడులు సీఎం చంద్రబాబు పైనే జరగనున్నాయనే టాక్ తెలుగురాష్ట్రాలలో జోరుగా వినిపిస్తోంది.