కుటుంబ సభ్యులతో పాటు విదేశాలకు వెళ్లనున్న ఎన్టీఆర్

వాస్తవం ప్రతినిధి: తన తండ్రి హరికృష్ణ చనిపోయిన బాధ నుండి తేరుకోకుండానే అరవింద సమేత చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్న ఎన్టీఆర్ కు ‘అరవింద సమేత’ సక్సెస్ కాస్త ఊరటనిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

తండ్రి మరణం నుండి తేరుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా చెబుతున్నారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే రామౌళి మల్టీస్టారర్ సినిమా కోసం ఎన్టీఆర్ డేట్లు కేటాయించబోతున్నాడు. డిసెంబర్ నుండి జక్కన్న మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పూర్తిగా ఫ్రెష్ మైండ్ తో ఎన్టీఆర్ మల్టీస్టారర్ లో నటించాలని భావిస్తున్నాడట. ఎన్టీఆర్ తో పాటు జక్కన్న మల్టీస్టారర్ లో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్న విషయం తెల్సిందే.