నా భర్త ట్రంప్ ని ప్రేమిస్తున్నాను: మోలానియా

వాస్తవం ప్రతినిధి: అవునా నా భర్త డోనాల్డ్ ట్రంప్‌ను ప్రేమిస్తున్నాను అని అమెరికా ఫస్ట్ లేడీ మోలానియా ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ పెళ్లి బంధంపై మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన పలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడం పై ఆమె తాజాగా స్పందిస్తూ ఈ విషయాలు ఏవీ కూడా తన దృష్టిని మరల్చడం లేదంటూ మెలానియా అన్నారు. తాను ఫోకస్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని ఆమె అన్నారు. తన వివాహ బంధంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మెలానియా కొట్టిపారేశారు. డోనాల్డ్‌ను లవ్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆమె అవునని బదులిచ్చారు. మేం ఇద్దరం బాగానే ఉన్నామన్నారు. తానో తల్లిని అని, ఫస్ట్ లేడీ అని, తన ముందు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయన్నారు. ఏది తప్పు, ఏది తప్పు కాదో తనకు తెలుసన్నారు. అయితే వివాహేతర సంబంధాలు తనకేమీ లేవని కూడా డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనతో ట్రంప్ శృంగారంలో పాల్గొన్నాడని పోర్న్ సటార్ స్టార్మీ డానియల్స్, ప్లేబాయ్ మోడల్ కేరన్ మెక్‌డుగల్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.