గిన్నిస్ బుక్”  లోకి…“జనసేన కవాతు”..??

వాస్తవం ప్రతినిధి:  జనసేన అధినేత ఈ నెల 15 న తలపెట్టిన కవాతు కార్యక్రమం గిన్నీస్ బుక్ లోకి ఎక్కనుందా..?? ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో  లేదో తెలియదు కానీ  ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చేయనున్న కవాతు కార్యక్రమానికి ఏపీలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కలిసి  పెద్దఎత్తున పాల్గొంటారని , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమలో జరగబోయే చివరి అంకాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారని మాత్రం తెలుస్తోంది…ఇదిలాఉంటే

ధవళేశ్వరం మీదుగా మొదలయ్యే జనసేన కవాతు ధవళేశ్వరం బ్రిడ్జ్ దాటడంతో తూగో జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ జనసేన వీర మహిళలు పవన్ కళ్యాణ్ కి హారతులు ఇచ్చి తూగో లోకి ఘనస్వాగతం పలుకనున్నారట. జనసేన చేపట్టబోయే కవాతుతో యావత్ దేశం మొత్తం దద్దరిల్లేలా ఊహలకి కూడా అందని రీతిలో కవాతు ఏర్పాట్లు అభిమానులు పార్టీనేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది..అంతేకాదు తాజా సమాచారం ప్రకారం ఓ భారీ రికార్డ్  ఈ కవాతు ద్వారా జనసేన పార్టీ క్రియేట్ చేయనుందట..

జనసేన పార్టీ నేతల కలిసి భారీ సంఖ్యలో చేపట్టబోయే ఈ కవాతు కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తుండి పోయేలా చేయాలని అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారట…అవకాశం ఉన్నంతలో గిన్నిస్ బుక్ లోకి చోటు సంపాదించేలా ‘జనసేన‘ భారీ ప్రయత్నాలు చేస్తోందని వార్త హల్చల్ చేస్తోంది..ఈ ఒక్క కవాతు దెబ్బకి రాజకీయ నేతల  గుండెల్లో గుబులు పుట్టేలా చేయాలనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది.

.అంతేకాదు ఇదే కవాతులో కొంతమంది వివిధ పార్టీలో ఉండే కీలక నేతలు సైతం జనసేన కండువా కప్పుకునే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు…తాజాగా నాదెండ్ల మనోహర్ జనసేన తీర్ధం పుచ్చుకున్న సంగతి విదితమే ఈ కోవలోకే మరో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది..ఏది ఏమైనా 15 న తలపెట్టిన జనసేన కవాతు ఎటువంటి  రికార్డులు క్రియేట్ చేస్తుందో వచ్చి చూడాల్సిందే.