సీఎం రమేష్ ఇంట్లో రెండవరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

వాస్తవం ప్రతినిధి: టీడీపీ సీనియర్ నేత, ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో శుక్రవారం మొదలైన ఐటీ సోదాలు… శనివారం కూడా కొనసాగుతున్నాయి. సీఎం రమేష్‌కు చెందిన కడప, విజయవాడ, హైదరాబాదులలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో  రెండోరోజు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం రోజున అర్థరాత్రి వరకు హైదరాబాద్‌లో రమేష్ నివాసంతో పాటు రిత్విక్ కంపెనీలో సోదాలు కొనసాగాయి. ఇవాళ ఉదయం కూడా ఐటీ అధికారులు మళ్లీ తనిఖీలు ప్రారంభించారు. దాదాపు 50 మంది నుంచి వంద మంది ఐటీ అధికారులు ఉదయాన్నే హైదరాబాద్‌లోని సీఎం రమేష్ నివాసానికి, ఆఫీసులకు చేరుకున్నారు. పొద్దున్నే తనిఖీలు చేపట్టారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ నుంచి ఇప్పటివరకు 8 హార్డ్ డిస్క్‌లను, 18 పెన్ డ్రైవ్‌లు, 6ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.