ఉదయ్ పూర్ జిల్లా లో ఘోర ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయ్ పూర్ జిల్లాలోని సాలంబూర్ వద్ద ఈ ప్రమదం జరిగింది. దీనితో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు  ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై అధికారులు వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.