“శివాజీ లీక్స్” –  మరో బాంబు పేల్చిన “శివాజీ”..ఈ సారి..??

sivaji leaks next target

సినిమా రంగంలో సినిమాలు లేక కొట్టిమిట్టాడుతున్న బాబు బజానా బృందం లీడర్ అలియాస్ శివాజీ మరో సంచలన విషయంతో మళ్ళీ తెరపైకి వచ్చాడు ఎలాగో వెండి తెరపై వెలగలేక చతికలు పడిన సదరు నటుడికి మీడియా తెరపైన కనిపించే అవకాశం వచ్చే సరికి గతం గుర్తొచ్చి ఒక్కసారిగా పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాడు. సరే ఇది ఎప్పుడూ ఉండేదే అసలు శివాజీ ఏమన్నాడనే విషయంలోకి వెళ్తే..

Image result for sivaji tollywood hero

‘ఆపరేషన్ గరుడ’ పేరుతో వీరలెవిల్లో టీడీపీ నేతలకంటే , చంద్రబాబు తనయుడు లోకేష్ కంటే కూడా బాబు పై తనకే లెక్కలేనంత ప్రేమ ఉందనేట్టు బిల్డప్ ఇచ్చే శివాజీ మళ్ళీ ఏపీ పై కుట్ర జరుగుతోందని తెరపైకి వచ్చారు..గతంలో సీఎం చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నోటీసుల అందబోతున్నాయంటూ శివాజీ ప్రకటించి ప్రకటించగానే కొద్ది రోజుల వ్యవధిలోనే బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు చేసిన ఆందోళన నేపథ్యంలో ఆయనకు మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది..దాంతో శివాజీ మాటల్లో ఎదో మర్మం ఉందని అనుకున్నారు అందరూ..

Image result for sivaji tollywood hero

అయితే శివాజీ ఇప్పడు మరో బాంబ్ పేల్చాడు. ” త్వరలో ఏపీలో అల్లర్లకు కుట్రపన్నుతున్నారు” బీ అలెర్ట్ అంటూ హెచ్చరికలు చేశాడు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్‌ చేస్తే ఏమీ రాదు…అంటూ టీడీపీ అధికార ప్రతినిధి సైతం కళ్ళు కుట్టుకునేలా శివాజీ స్పీచ్ ఇచ్చారు.. ప్రత్యేకహోదా అంశం రాజకీయ నిర్ణయమని ఢిల్లీలో ప్రత్యేకహోదాపై చర్చ నడుస్తోంది. కుతంత్రాలతో ఏపీని చిన్నాభిన్నం చేయాలని భారీ కుట్ర జరగబోతోందని ఆరోపించారు శివాజీ…అంతేకాదు ఐటీ దాడులపై శివాజీ తీవ్రంగా స్పందించారు..టీడీపీ నేతల ఇళ్ళపై జరుగుతున్న ఐటీ దాడుల లక్ష్యం చంద్రబాబు అని అర్థమవుతోందని డైరెక్ట్ గా బాబు ని ఎన్కౌంటర్ చేసేయండి రాష్ట్ర ప్రజలని ఎందుకు హింసించడం..ఎందుకు ఏపీ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అంటూ మండి పడ్డారు..

Image result for sivaji tollywood hero

ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే..ఐటీ దాడులు టీడీపీ నేతల ఇళ్ళపై చేస్తే ఏపీ ప్రజలకి ఎలా అన్యాయం జరుగుతుందో ఆ లాజిక్ ఏమిటో శివాజీ కి మాత్రమే అర్థమయ్యే విషయం..శివాజీ మొత్తం ఎపీసోడ్ ని ఒక్క సారిగా పరీక్షిస్తే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకోవడానికి పాకులాడుతున్నాడని అందుకే సీన్ లేకపోయినా సీన్ బాయా క్రియేట్ చేస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు..ఏది ఏమైనా సరే శివాజీ రోజు రోజుకి ఓ కామెడీ పీస్ అయిపోతున్నాడు అచ్చం కేయే పాల్ లాగా అంటున్నారు వీక్షకులు..