భారత్-విండీస్ ల మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్….టాస్ గెలిచిన విండీస్

వాస్తవం ప్రతినిధి: భారత్‌-విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో టెస్టు లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని విండీస్‌ భావిస్తోంది. మొదటి టెస్టులో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌కు కొనసాగిస్తున్నట్లు టీమిండియా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ కి దిగిన విండీస్ జట్టు వరుసగా నాలుగు వికెట్ల ను కోల్పోయినల్టు సమాచారం.