శ్రీవారిని దర్శించుకొన్న పవన్, నాదెండ్ల

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాదెండ్ల.. జనసేనలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన తెనాలి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.