బాలయ్యతో ‘ఆకుచాటు పిందె తడిచే’ సాంగేసుకొంటున్న రకుల్

వాస్తవం సినిమా: నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నాడు ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ‌. క్రిష్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రోజుకో స‌న్సెష‌న్ సృష్టిస్తుంది.
ఇప్ప‌టికే ఎన్టీఆర్ రూపంలో ఉన్న బాల‌య్య ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంటే , తాజాగా సినిమాలోని శ్రీదేవి లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. శ్రీదేవిగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఎవర్ గ్రీన్ సాంగ్ ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా 1979 లో విడుదలైన వేటగాడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆకుచాటు పిందె తడిచే అంటూ సాగె రైన్ సాంగ్‌ని తెలుగువాళ్లు ఎప్పటికి మరచిపోలేరు. తడి అందాలతో శ్రీదేవి, గమ్మత్తైన స్టెప్పులతో ఎన్టీఆర్ వెండి తెరపై మ్యాజిక్ చేశారు..
వేటగాడు చిత్రంలోని ఎన్టీఆర్, శ్రీదేవి స్టిల్స్‌తో బాలయ్య, రకుల్ ని పోల్చుకుంటూ ఫాన్స్ మురిపోతున్నారు. బాలయ్యని ప్రతి యాంగిల్ లో ఎన్టీఆర్‌ని తలపించేలా చూపిస్తున్నారు.
చంద్రబాబు పాత్రలో రానాని, ఏఎన్నార్ పాత్రలో సుమంత్‌ని అద్భుతంగా చూపించబోతున్నాడు క్రిష్‌.ఇక సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. జ‌న‌వ‌రికి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.