బహ్రెయిన్ లో పేలిన గ్యాస్ సిలిండర్……నలుగురు మృతి!

వాస్తవం ప్రతినిధి: మధ్య ఆసియా దేశమైన బహ్రెయిన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. 20మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బహ్రెయిన్ లోని ఓ భవనం రెండో అంతస్తు లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ పేలుడు ధాటికి ఆ భవనం మొత్తం నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు. అలానే ప్రమదం సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు హుటా హుటిన అక్కడకు చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే భవన శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని బృందాలు గాలిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ ఘటనలో మృతి చెందినా వారిలో తెలుగు వారు ఉన్నారంటూ అక్కడి మీడియా కధనాలు ప్రచురించింది. దీంతో ఏపీ సీ ఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదం పై ఆరా తీశారు. అక్కడి భారత రాయబార కార్యాలయంతో సంప్రదించినట్లు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ ప్రమాదంలో బాధితులంతా బంగ్లాదేశ్‌కు చెందినవారేనని తెలిసిందని చెప్పారు. ఈ ఘటనలో తెలుగు వారు బాధితులుగా ఉంటే వెంటనే వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.