పాక్ మాజీ క్రికెటర్ రికార్డ్ ని కోహ్లీ సమం చేస్తాడా!

వాస్తవం ప్రతినిధి: ఈనెల 12న హైదరాబాద్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరగనున్న రెండో టెస్టులో క్రికెట్‌ అభిమానుల కళ్లన్నీ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీపైనే. ఎందుకంటే  విండీస్‌తో జరిగిన తొలిటెస్టులో కోహ్లీ శతకం బాది టెస్టు కెరీర్‌లో 24వ శతకాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండో టెస్టులోనూ ఈ పరుగుల యంత్రం ఇదే జోరు కొనసాగిస్తే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌(25శతకాలు) రికార్డును సమం చేసేస్తాడు అన్నమాట. కోహ్లీ ఇప్పటివరకూ 72 టెస్టులు ఆడాడు. 54.66 సగటుతో 6,286 పరుగులు చేశాడు. ఇక ఇంజమామ్‌ 120 టెస్టుల్లో 25 శతకాలు చేసి 49.60 సగటుతో 8,830 పరుగులు చేశాడు.

టెస్టుల్లో ఎక్కువ శతకాలు చేసిన వారి జాబితాలో 21వస్థానంలో ఉన్న కోహ్లీ మరో శతకం చేస్తే ఇంజమామ్ రికార్డును సమం చేస్తాడు. ఈ జాబితాలో సచిన్‌ తెందుల్కర్‌ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.