ఫస్ట్ లుక్: శ్రీదేవి గా ‘రకుల్’

వాస్తవం సినిమా: నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బయోపిక్ షూటింగ్ లో పాల్గొంది .ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రకుల్, శ్రీదేవి పోలికలతో కనిపిస్తూ బాగానే ఆకట్టుకుంటుంది.
ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.