నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల నిర‌స‌న‌

వాస్తవం ప్రతినిధి: విజయ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలను విలీనం చేయాల‌న్న‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్‌ ఉద్యోగులు నేడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర రాజధానులు, ప్రధాన పట్టణాల్లో ఆఫీసు పని వేళలు ముగిసిన తర్వాత ఈ నిరసన ప్రదర్శనలు ఉంటాయ‌ని అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఎఐబిఈ) జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ఈ నెల 12న ముంబైలో జరిగే సమావేశంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.