వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అధ్బుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిన జైశ్వాల్

వాస్తవం ప్రతినిధి: భారత్‌-శ్రీలంకల మధ్య ఆదివారం అండర్‌-19 వరల్డ్‌ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అత్యత్తమ ప్రదర్శన చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు యశ్వంత్‌ జైశ్వాల్‌. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్‌ కళ్లు చెదిరే షాట్లతో శ్రీలంకను బెంబేలెత్తించాడు. జైశ్వాల్‌ 85 పరుగులు (113 బంతుల్లో 9×4, 1×6) చేసి భారత్‌ జట్టుకు విజయావకాశాలను అందించాడు. నిజానికి జైశ్వాల్ ది నిరుపేద కుటుంబం. సరైన ఇల్లు లేదు,తినడానికి తిండి కూడా లేదు. కానీ క్రికెట్ అంటే ఉన్న పిచ్చి తో చిన్నప్పటి నుంచి దానిపైనే దృష్టి పెట్టి మరీ గల్లీ లో ప్రాక్టీస్ చేశాడు. కనీసం క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. దీనితో ముంబాయి లోని ఒక చిన్న దుకాణం లో చేరాడు, అయితే డ్యూటీ లో ఉండగా నిద్ర పోతున్నాడు అన్న కారణంగా జైశ్వాల్ ని అక్కడ నుంచి పంపించేశారు. దీనితో అనంతరం ముంబయి వీధుల్లో ఉండే ఫుడ్‌ ట్రక్‌లో పనికి చేరాడు. కొద్ది రోజులు అక్కడే పనిచేసి రెండు పూటల మాత్రమే తిని మిగిలిన డబ్బును దాచి క్రికెట్‌కు కావల్సిన సరంజామా మొత్తం కొనుక్కున్నాడు. అలా దగ్గర ఉండే మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడికి జ్వాలా సింగ్‌ అనే కోచ్‌ పరిచయమ్యారు. క్రికెట్‌ పట్ల జైశ్వాల్‌ ఆసక్తిని గమనించి సింగ్‌ తన జట్టులో చేర్చుకుని శిక్షణ ఇచ్చి అండర్‌-19కు పంపడం తో ఇప్పుడు అందరూ కూడా జైశ్వాల్ గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.