మరోసారి కిమ్, ట్రంప్ ల శిఖరాగ్ర సమావేశం

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్  ఉన్‌ల మధ్య మరో శిఖరాగ్ర సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రస్తుతం ఉత్తర కొరియా లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ విషయమై ఆయన పురోగతి సాదించారు. ప్యాంగ్‌యాంగ్‌లో ఆదివారం కిమ్‌తో రెండు గంటల పాటు సమావేశమైన పాంపియో.. అణు నిరాయుధీకరణతో పాటు అమెరికా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ట్రంప్‌తో మరోసారి సమావేశం అయ్యేందుకు కిమ్‌ ఈ భేటీలో అంగీకరించినట్లు సమాచారం.