కోహ్లీ అభ్యర్ధన పై తక్షణమే నిర్ణయం తీసుకోలేము అన్న సీఓఏ ప్రతినిధి

వాస్తవం ప్రతినిధి: భారత జట్టు విదేశీ సిరీస్‌ల కోసం వెళ్లినపుడు పర్యటన పూర్తిగా ఆటగాళ్లతో వారి భార్యలు ఉండేలా అనుమతించాలంటూ ఇటీవల టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బీసీసిఐ ని కోరిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ చేసిన అభ్యర్థనపై తక్షణమే ఓ నిర్ణయానికి రాలేమని క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) చెప్పింది. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్ల వెంట భార్యలు ఉండేలా అనుమతిస్తున్నారు. ‘‘దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోలేం. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే వదిలేశాం’’ అని సీఓఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.