సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్వీటీ?

వాస్తవం సినిమా: స్టార్ హీరోయిన్ అనుష్కకి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. బాహుబలి తరువాత అనుష్క కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే నటించిన సంగతి తెలిసిందే. అది కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రం భాగమతి. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత అనుష్క మరో చిత్రంలో కనిపించలేదు. మరో సినిమాకు కూడా ఆమె అంగీకారం తెలపలేదు. దీనితో అనుష్క సినిమాలకు దూరం కాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు అధికం అవుతున్నాయి.

మరోవైపు ఇటీవల అనుష్క దోష నివారణార్థం అనేక పూజలు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క వయసు 36 ఏళ్ళు. ఆమె కుటుంబ సభ్యులు అనుష్కకు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.