తెలంగాణలో అమిత్ షా రాజకీయం..వ్యూహం ఫలిస్తుందా..?

వాస్తవం ప్రతినిధి:  రాజకీయాలు చేయలన్నా..రాజకీయా వ్యుహాలని ఖచ్చితంగా అమలు చేయాలన్నా అమిత్ షా లాంటివారికే చెల్లుతుంది అంటారు…గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి మోడీ ప్రధానిగా చక్రం తిప్పడానికి ప్రధానమైన కారకుడు కేవలం అమిత్ షా వ్యుహాలు అనడంలో సందేహం లేదనే చెప్పాలి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ రాష్ట్రాలో వచ్చిన ఎన్నికల్లో సైతం తిరుగులేని ఆధిక్యతని సాధించడంలో అమిత్ షా స్కెచ్ తప్పకుండా ఉంటుందంటారు..

ఇదిలాఉంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగరేయడానికి అక్కడ ఒక సాధువుని సీఎం కుర్చీలో కూర్చో పెట్టడానికి అమిత్ షా ఫార్ములానే ప్రధానమైన కారణమని బహిరంగంగా తెలిసిన విషయమే..అయితే ఇప్పుడు అదే ఫార్ములాని  తెలంగాణా రాష్ట్రంలో కూడా అప్లై చేయడానికి షా వ్యుహాలని సిద్దం చేస్తున్నారట..ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్య నాధ్ నిసీఎం అభ్యర్థిగా తెర మీదకు తెచ్చి భారీగా ఓట్లు కొల్లగొట్టిన బిజెపిఇప్పుడు కూడా తెలంగాణా ఎన్నికల్లో యూపీ లో ఆదిత్యనాద్ లాగానే తెలంగాణలో శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది..దాంతో ఒక్క సారిగా పరిపూర్ణనంద బీజేపీలో చేరటం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది.

పరిపూర్ణానంద ని సీఎం అభ్యర్ధిగా కాకపోయినా సరే ఎంపీగా అయినా పోటీ చేయిస్తారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. అంతేకాదు స్వామీజీ కూడా గతంలో బీజేపీలో చేరికలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన ఘటనలు ఉన్నాయి. బీజేపీలో చేరే విషయమై తన నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశాను దేశం కోసం ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవడానికి నేను సిద్దంగా ఉన్నానని ఆయన గతంలోనే తెలిపారు.ఈ తరుణంలోనే షా ని కలాదానికి పరిపూర్ణ ఢిల్లీ వెళ్ళడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా హీట్ పెరిగిపోయింది…ఇదిలాఉంటే

పరిపూర్ణ స్వామి కేవలం శ్రీపీఠం అధిపతిగానేగాక… సామాజిక అంశాల్లోనూ చురుగ్గా ఉంటారు స్వామిజీ. రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో దాన్ని స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా ఖండించారు. ఆ పరిణామాలతో శాంతి భద్రతలను కారణంగా చూపుతూ.. కత్తిమహేశ్‌‌ను ఆరు నెలల పాటు బహిష్కరించిన హైదరాబాద్ పోలీసులు, పరిపూర్ణానందని సైతం బహిష్కరించారు...దాంతో హిందువుల తరుపున తెలుగు రాష్ట్రాలలో వాయిస్ వినిపించిన ఏకైక వ్యక్తిగా ఆయన ఎంతో మంది హిదువులకి దగ్గర అయ్యారు..ఈ క్రమంలో ఒక వేళ  పరిపూర్ణానంద ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే హిందువుల ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉండటంతో మిగిలిన పార్టీలలో గుబులు మొదలయ్యిందనే చెప్పాలి.