“జేడీ” కి  ఆ జాతీయ పార్టీ “రెడ్ కార్పెట్”..!!

వాస్తవం పతినిధి:  జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ఎంట్రీ పై రోజు రోజు కి క్లారిటీ వస్తోంది..ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీస్ ఉండగానే స్వచ్చందంగా ఉద్యోగవిరమణ  చేసి సేవా భావంతో ప్రజలకి సేవచేయాలని భావిస్తున్నఈ మాజీ  జేడీ లక్ష్మీనారాయణ ఏపీలో రైతుల పక్షాన పోరాడుతున్నారు..రైతుల సమస్యలపై అధ్యయనం చేసిన ఆయన ఏ పార్టీ లోకి వెళ్తారోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. ఒక నిజాయితీ గల సీబీఐ ఆఫీసర్ గా దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న జేడీ కోసం ఏపీలో అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి..

ముఖ్యంగా జేడీ ఎంట్రీ ఇస్తే ఆయా పార్టీలు ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని వ్యుహాలు రచిస్తున్నాయి, అంతేకాదు జేడీ రైతుల సమస్యలు తెలుసుకుంటూ 13 జిల్లాలలో పర్యటనలు చేస్తూ వారి వారి సమస్యలపై అధ్యయనం చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే వ్యవసాయ మంత్రిగా మారి రైతులకి సేవ చేయాలనేది తన లక్ష్యమని జేడీ తన మనసులో మాట ఎప్పుడో చెప్పారు..ఈ క్రమంలో జేడీ జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందని ఒకరు..లేదు టీడీపీ కానీ బీజేపీ లోకి గానీ వెళ్ళే అవకాశం ఉందని మరొకరు ఇలా

జేడీ పొలిటికల్ ఎంట్రీ పై రోజుకో వార్త హల్చల్ చేస్తూండటంతో జేడీ ఆవార్తల్ని ఎన్నో సార్లు ఖండించారు, అయితే రెండు రోజుల క్రితం జేడీ తిరుపతిలో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు..రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాను కానీ ఎప్పుడు ఏమిటి అనేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు అయితే ఈ క్రమంలో జేడీ ఎంట్రీ పై మరొక వార్త హల్చల్ చేస్తోంది..జాతీయ స్థాయిలో బీజేపీ ని గడగడలాడించిన ఆమాద్మీ పార్టీ లోకి జేడీ వెళ్లనున్నారని..అంతేకాదు ఏపీలో కీలక భాద్యతలు ఆ పార్టీ తరుపున ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే.

ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆప్‌ జిల్లా కన్వీనర్‌ పోతిన వెంకట రామారావు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నీతివంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌లోకి వచ్చి రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడానికి లక్ష్మీనారాయణ కృషి చేయాలని కోరారు...సేవ చేయాలనుకునే లక్ష్మీ నారాయణ గారికి ఇది సరైన వేదికని తెలిపారు..ఈ ప్రకటనతో జేడీ చీపురు పార్టీ వైపుగా వెల్లనున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.