బహిరంగ మూత్ర విసర్జన చేసిన రాజస్థాన్ మంత్రి

వాస్తవం ప్రతినిధి: ఓవైపు స్వచ్ఛ్‌ భారత్‌ కోసం దేశ ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఊటంకిస్తుంటే,మరోవైపు ఆయన పార్టీ కే చెందిన మంత్రులు స్వచ్చ భారత్ ని తుంగలోకి తొక్కి ప్రవర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ కి చెందిన రాజస్తాన్ మంత్రి శంభు సింగ్ ఖేటసర్ బహిరంగ మూత్ర విసర్జన చేసి నవ్వులపాలయ్యారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ పనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇందులో మరో విశేషం ఏమిటంటే సదరు మంత్రిగారు తమ ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్ పక్కనే మూత్ర విసర్జన చేశారు. అయితే దీనిపై మీడియా ప్రశ్నిస్తే దీనిలో ఎలాంటి తప్పు లేదన్నట్లు ఆయనగారు తిరిగి సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో శంభు సింగ్‌ బహిరంగ మూత్ర విసర్జన చేశారు.దీనిపై మీడియా ప్రశ్నించగా సి ఎం పోస్టర్ పక్కద మూట విసర్జన చేయలేదని,గోడ పక్కనే చేశానని వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా మోదీ చెప్పింది బహిరంగ మల విసర్జన చేయకూడదని తప్ప,మూత్ర విసర్జన కాదని,మల విసర్జన చేయడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయని,మూత్ర విసర్జన వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదు అంటూ వివరణ ఇచ్చారు. తను ఈ పని చేసిన చోటు చాలా విశాల ప్రాంతమని, అక్కడ జనవాసం లేకపోవడంతో అసలు సమస్యే ఉండదని ఈ రాజస్తాన్‌ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దానితో దగ్గరల్లో ఎక్కడా టాయిలెట్స్‌ లేకపోవడం తో ఆ విధంగా చేయాల్సి వచ్చింది అంటూ ఆయన చేసిన పనిని సమర్ధించుకున్నారు.