పవన్ పార్టీని కూల్చే కుట్ర…ఎవరా తేనె పూసిన కత్తి..??

వాస్తవం ప్రతినిధి:  ఏపీలో జనసేన గ్రాఫ్ రోజు రోజు కి పెరుగుతోంది ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో జనసేన జోరు మాములుగా లేదని తెలుస్తోంది..ప్రజా పోరాట యాత్ర పేరుతో జనసేనాని ప్రజల్లో తిరుగుతూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి మైలేజ్ పెంచటంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి..ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మూడు నాలుగు జిల్లాలపై ముఖ్యంగా తన ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు అంతేకాదు అధికశాతం సీట్లు ఈ జిల్లాల నుంచీ వచ్చేలా వ్యూహాలు రచిస్తూనే అందుకు తగ్గట్టుగా పార్టీని ప్రజల్లో తీసుకువేల్తున్నాడు అయితే ఒక పక్క పవన్ ఎంతో వ్యయ ప్రయాసలుపడి పార్టీని బలోపేతం చేస్తుంటే 

ప్రజారాజ్యం తరహాలో పార్టీపై కుట్రలు పన్నడానికి దొడ్డి దారులు వెతుకుతున్నారు కొంతమంది నమ్మక ద్రోహులు.పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు అంటూ… అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద ఎలా అయితే అపవాదు వచ్చిందో ఇప్పుడు కూడా అదే పంథాలో ఇప్పడు జనసేన మీద కూడా కుట్ర పూరితమైన ఆరోపణలు వస్తున్నాయి..అయితే ఈ వ్యవహారంలో పవన్ కి సంబంధం లేకుండా కొంతమంది దళారులు టికెట్లు ఇప్పిస్తామనని అందినకాడికి ఆశావాహుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నారట. అయితే ఈ వ్యవహారం పవన్ వరకూ వెళ్లడంతో.. ఎవరైనా టికెట్లను ఇప్పిస్తామని అంటే వారిని నమ్మవద్దు..అని బహిరంగంగా పవన్ ప్రకటించాల్సి వచ్చింది.

జనసేన లోకి చేరడానికి ఎంతో మంది నేతలు పోటీలు పడుతున్నా సరే ఇప్పటివరకూ చేరింది మాత్రం కొద్ది మంది వ్యక్తులు మాత్రమే అయితే వాళ్లే అంతర్గత పోరు మొదలుపెట్టారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అవి పతాక స్థాయికి చేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన వారందరికీ షాక్ ఇచ్చింది…ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోటరీలో ఉండే ఒకానొక వ్యక్తి పార్టీలో పవన్ కంటే కూడా అన్నీ తానై పెత్తనం చెలాయిస్తున్నాడని కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదని..మేమంతా పార్టీలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే నని పార్టీలో ఇలాంటి ఇబ్బందికర వ్యక్తులు ఉండటం మొక్కలు చీడ పట్టినట్టుగా ఉంటుందని అలాంటి వారిని ముందుగానే తుంచడం మంచిదని అభిప్రాయాలు కొంతమంది నేతల నుంచీ వ్యక్తం అవుతున్నాయి.

అయితే పార్టీలో మీక టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పడం వెనుక పవన్ కోటరీలో ఆ వ్యక్తి ఉన్నాడా..? అందుకే పవన్ మొన్నటి సభలో ఎలాంటి వ్యక్తిని అయినా తన పర భేదం లేకుండా కుప్ప కూల్చేస్తానని హెచ్చరికలు జారీ చేశాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..ఏది ఏమైనా పార్టీ ఒక బలమైన నిర్మాణం అవుతున్న క్రమంలో ఈ తరహా వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టే విషయమే అయితే పవన్ కళ్యాణ్ కి తన ఫ్యాన్స్ అండ ఉన్నంత వరకూ పార్టీపై ఈగ కూడా వాలే అవకాశం ఉండదనేది సత్యం.