కవానా కు ఊరట….ఇద్దరు సేనేటర్ల ఆమోదం!

వాస్తవం ప్రతినిధి: మొన్నటి వరకు ఆరోపణల తో సతమమైన బ్రెట్‌ కవానా కు ఊరట కలిగింది. అమెరికా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ట్రంప్‌ ప్రతిపాదించిన బ్రెట్‌ కవానా అన్న విషయం తెలిసిందే. అయితే ఆయనపై గత కొన్ని రోజులుగా దిగ్బ్రాంతి కలిగించే ఆరోపణలు,కరుడుగట్టిన రాజకీయాలు,నిరసనలు,ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన నామినేషన్ పై అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కవానా కు ఇద్దరు సెనేటర్లు ఆమోదం వ్యఖ్తం చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఈ నామినేషన్‌ పోరులో ఆయన గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు సెనెటర్లు ఆయనకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో కవానా కు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. రిపబ్లికన్‌ సెనెటర్‌ సుశాన్‌ కొలిన్స్‌, డెమోక్రాట్‌ సెనెటర్‌ జో మంచిన్‌లు బ్రెట్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కవానా ఎన్నిక లాంఛనంగా మారనుంది. దాదాపు నెల రోజుల పాటు దేశాన్ని కుదిపివేసిన ఈ వ్యవహారం దీంతో ఒక కొలిక్కి రానుంది అన్నమాట.