కాబూల్ లో ఉగ్రదాడి!

వాస్తవం ప్రతినిధి: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి ఉగ్రదాడి చోటుచేసుకుంది. తాలిబన్‌ ఉగ్రవాదులు జరిపిన బాంబుల దాడిలో శనివారం ఇద్దరు భద్రత సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తుంది. అలానే ఈ బాంబు దాడిలో కాబూల్‌ జిల్లా పోలీసు అధిపతి సహా ఆరుగురు అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడినట్లు తెలుస్తుంది. మరో ఘటనలో – పశ్చిమ ఘోర్‌ ప్రావిన్సులోని ఓ గ్రామంలో స్థానిక ముఠా కమాండర్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లినభద్రత సిబ్బందిపై అతని ప్రైవేటు సైన్యం కాల్పులకు దిగడంతో నలుగురు పోలీసు అధికారులు, ఏడుగురు పౌరులు మృతి చెందినట్లు సమాచారం.