జీవో రద్దు పై మంత్రికి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి                   

వాస్తవం ప్రతినిధి: ఏపీ మంత్రి నారాయణకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసినట్లు తెలుస్తుంది. జీవోనెంబర్ 279 ను రద్దు చేయాలని లేఖ ద్వారా మంత్రి నారాయణ ను రామకృష్ణ కోరినట్లు తెలుస్తుంది.  అలానే మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం జీవోను రద్దు చేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రిని లేఖద్వారా కోరారు.