ఉత్తరాంధ్ర లో మరో ఉద్యమం..జనసేనాని సంచలన వ్యాఖ్యలు..!!!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఒక కీలక ఉద్యమానికి తెరతీయనున్నారా..? మరొక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలకనున్నారా..? అంటే అది కేవలం ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు..ఉత్తరాంధ్ర విషయంలో నిర్లక్ష్య వైఖరిని గనుకప్రభుత్వం అవలంబిస్తే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్..అంతేకాదు మరొక రాష్ట్ర విభజన ఉద్యమం మొదలవుతుందని ట్విట్టర్ వేదిక గా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక్క సారిగా ఉత్తరాంధ్ర విషయంలో పవన్ ఎందుకు ఫైర్ అయ్యారు అంటే

ఈరోజు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణా రాష్ట్రం ఏపీ నుంచి విడిపోవడానికి అసలు కారణం భాష, యాసను అవమానించడమేనని ఆ కారణమే రాష్ట్ర విభజన ఉద్యమానికి ప్రేరేపించిందని తెలిపారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్ల అదే రకమైన వివక్ష కొనసాగుతోందని..వారి భాషను..యాసను అవమానిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు..ఒక వేళ ప్రభుత్వం వారి మనోభావాలని పట్టించుకోక పోతే మరోసారి రాష్ట్ర విభజన తప్పకపోవచ్చని ఘాటుగా హెచ్చరించారు.

ఒక ప్రాంత బాష యాసలని అపహాస్యం చేయడం మానుకోవాలని..ఈ చర్యలు ఆయా ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. .ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని సహజ వనరులు ఉన్నా వెనుకబాటుకు గురవ్వడం అనేది ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలకి అద్దంపడుతుందని పవన్ వ్యాఖ్యానించారు.రాజకీయ నాయకులు ఎవరికీ వారు బాగుపడుతున్నారని అయితే పజలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..

ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ గతంలోనే ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలు పొట్ట కూటికోసం వలసలు వెళ్ళడం ఎన్నో ఇబ్బందులు పడటం , అక్కడి ప్రజల ఆరోగ్య విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం , సహజ సంపదలు కొల్లగొట్టే ప్రయత్నంలో మన్యంలో ఉండే ప్రజలని ఇబ్బందులకి గురించేయడం, ఇలాంటి విషయాలపై ఏకరువు పెట్టారు. ఇక మీదట మళ్ళీ ఉత్తరాంధ్ర లో ఎలాంటి అన్యాయం జరిగినా అక్కడి ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అప్పట్లోనే పవన్ హెచ్చరించారు. అయితే తాజాగా పవన్ చేసిన ఈ ట్వీట్ తో ఎలాంటి ఉపద్రవం ముంచుకు వస్తుందోనని కంగారు పడుతున్నారు ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేతలు.