మాజీ ఉద్యోగిని పై లైంగిక వేధింపులు…కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యుడు కి సమన్లు

వాస్తవం ప్రతినిధి: ఇటీవల మాజీ ఉద్యోగిని పై లైంగిక వేధింపులకు దిగారంటూ ఆరోపణలు వేల్లువెట్టడం తో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ సభ్యుడు చిరాగ్ పట్నాయక్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హై కోర్టు తాజాగా శుక్రవారం నాడు ఆయనకు సమన్లు పంపింది. 2019 ఫిబ్రవరి 2న తమ ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మాజీ ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఈ ఏడాది జూలైలో పట్నాయక్‌ను అరెస్టు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 354ఎ, 509 కింద ఆయనపై ఢిల్లీ పోలీసులు ఇటీవల మేజిస్ట్రేట్ కోర్టు ముందు చార్జిషీటు దాఖలు చేశారు. ట్వీట్ల చెకింగ్ పేరుతో పట్నాయక్ తనను వెనక వైపు నుంచి చుట్టేయడం, చాలా క్లోజ్‌గా రావడం వంటివి చేశారంటూ ఫిర్యాదుదారు పేర్కొనడాన్ని ఛార్జిషీటులో చేర్చారు. తీవ్ర డిప్రెషన్‌తో 2018 మే 17న తాను రాజీనామా చేశానని, అయితే తన రాజీనామాను అంగీకరించడం కానీ, తోసిపుచ్చడం కానీ చేయలేదని ఫిర్యాదుదారు పేర్కొంది. సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి దివ్వ స్పందన సైతం మే 14న చిరాగ్‌పై తన ఫిర్యాదును వినేందుకు కూడా ఇష్టపడలేదని కూడా ఆమె పేర్కొన్నడాన్ని కూడా పోలీసు ఛార్జిషీటులో చేర్చారు.