మహారాష్ట్రలో ఘోర ప్రమాదం….10 మందికి పైగా గాయాలు!

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని శివాజీ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.  ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలిపోయింది. ఈ హోర్డింగ్.. రోడ్డుపై పడిపోవడంతో.. పలు ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు అక్కడకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.