హూక్కాయిడో ద్వీపం లో స్వల్ప భూకంపం

వాస్తవం ప్రతినిధి: జపాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. జపాన్‌లోని హొక్కాయిడో ద్వీపంలో అట్సుమా సమీపంలో శుక్రవారం ఉదయం ఈ స్వల్ప భూకంపం సంభవించినట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది. అయితే ఈ భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించింది అన్న దానిపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అట్సుమాలోని టౌన్‌హాల్‌లో టెలివిజన్‌ చూస్తుండగా అత్యవసర భూకంప అలారాలు మోగిన దృశ్యాలు జాతీయ ఛానెల్‌లో ప్రసారమయ్యాయి. కాగా, గత నెలలో హొక్కాయిడ్‌ ద్వీపంలో సంభవించిన భూకంపంలో సుమారు 40మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.