కాజల్ మెడలో కొండచిలువ.. వీడియో వైరల్!

వాస్తవం సినిమా: కాజల్ తన మెడలో పెద్ద కొండ చిలువను వేసుకొంది. మామూలుగా పాములు తమ దగ్గరికి వస్తేనే భయపడిపోతుంటారు. అటువంటిది ఒక పెద్ద కొండ చిలువను కాజల్ తన మెడలో వేసుకొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యంగ్ హీరోలు సీనియర్‌ హీరోలు అన్న తేడా లేకుండా ఫుల్‌ ఫాంలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్.ఇటీవల ఈ అమ్మదికి అవకాశాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో ఈ బ్యుటీ ప్రస్తుతం యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ థోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. షూటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్‌ కాజల్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు.