డీకే అరుణ పై నిప్పులు చెరిగిన రామ్మోహన్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: మక్తల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి.. తన సోదరి డీకే అరుణపై నిప్పులు చెరిగారు. జేజమ్మ అంటా.. ఎవరికి జేజమ్మ? అంటూ డీకే అరుణపై రామ్మోహన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వనపర్తి జిల్లాకు సమీపంలోని నాగవరంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలోరామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలీబాబా 40 మంది దొంగలు వచ్చినట్లు.. నిన్న గద్వాలకు 40 మంది దొంగలు వచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు అని, జేజమ్మ అంటా.. ఎవరికి జేజమ్మ? మంత్రిగా జిల్లాకు ఏం ఒరగబెట్టింది. అట్లాంటి వారిని తెలంగాణ నుంచి తరిమికొట్టాలి. ఆంధ్రా పార్టీలకు వత్తాసు పలుకుతూ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇట్లాంటి వారిని ఊర్ల నుంచి తరిమికొట్టాలి అని ఆయన విరుచుకుపడ్డారు.