ఒకే వేదికపై బాలయ్య, విజయశాంతి

వాస్తవం ప్రతినిధి: నందమూరి బాలకృష్ణ, విజయశాంతి 1990 దశకంలో వెండితెరపై వీరిద్దరిదీ ఎంత సూపర్ హిట్ జంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లారీడ్రైవర్, రౌడీ ఇన్స్‌పెక్టర్, ముద్దులమావయ్య లాంటి చిత్రాలు అప్పట్లో రికార్టులు సృష్టించాయి. అలా సక్సెస్‌పుల్ జంటగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ, విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత కలిసి పనిచేయబోతున్నారు. అయితే ఈ సారి సినిమాల కోసం కాదు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహాకూటమికి ప్రచారం చేయబోతున్నారు.
గ‌త కొన్ని నెల‌లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న రాముల‌మ్మ తెలంగాణాలో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఎన్నిక‌ల క‌ద‌న రంగంలోకి దిగారు. అధికార , ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అంద‌రి కంటె ముందుగానే అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ ప్ర‌చారంలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తూ బ‌హిరంగ స‌భ‌ల‌తో ఎన్నిక‌ల‌ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక హ‌రీష్ రావు రూర‌ల్ ఏరియాల్లో, కేటీఆర్ అర్బ‌న్ ప్రాంతాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

ఇక ప్ర‌తిప‌క్షాల విష‌యానికి వస్తే టీఆర్ ఎస్ ను మ‌రో సారి అధికారంలోకి రాకుండా చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఇలా పార్టీలన్నీ కలిసి ఒక్కటయ్యాయి. అయితే ఈ కూటమికి హిట్ జంట ప్రచారం చేయనుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తరపున లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి, తేదేపా తరపున నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఒకే వేదిక మీద‌నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్నారు.