రెండు భాగాలుగా విడిపోయిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ

వాస్తవం సినిమా: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని నందమూరి బాలకృష్ణ స్వయంగా వాళ్ల నాన్న ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నారు.
తాజాగా.. ప్రాజెక్టు టైటిల్‌లో మార్పులు చేపట్టామంటూ క్రిష్.. ఒకేరోజు రెండు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేశారు.మొదట ‘ఎన్టీయార్- కథానాయకుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశామని.. జనవరి 9న విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ పౌరాణిక పాత్రలో బాలకృష్ణ వేసిన ఎన్టీయార్ గెటప్‌ను ప్రజెంట్ చేశారు. బయోపిక్ మొత్తం ఎన్టీయార్ సినిమా కెరీర్ మీద మాత్రమే నడుస్తోందన్న భావన కలిగించారు. కొన్ని గంటలు గడిచేసరికి.. మరో బ్రేకింగ్ న్యూస్! ‘ఎన్టీయార్- మహానాయకుడు’ అంటూ బాలకృష్ణ ‘పొలిటికల్ ఎన్టీయార్’ గెటప్‌ని పోస్ట్ చేశారు. దీన్ని రిపబ్లిక్‌డే నేపథ్యంలో రెండురోజుల ముందు జనవరి 24న విడుదల చేయనున్నట్లు సమాచారమిచ్చారు.

”అతను కథగా మారితే, ‘కథానాయకుడు’.. అతనే ఓ చరిత్రయితే, ‘మహానాయకుడు’…” అంటూ క్రిష్   క్లారిటీ కూడా ఇచ్చేశారు.