మలేషియా మాజీ ప్రధాని భార్య ను అరెస్ట్ చేసిన అవినీతి నిరోధకశాఖ అధికారులు

వాస్తవం ప్రతినిధి: మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ భార్య రోస్‌మహ్ మన్సూర్(66)ను బుధవారం ఆ దేశ అవినీతి నిరోధక విభాగం అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.  కోట్ల డాలర్ల అవినీతి ఆరోపణలతో నజీబ్ గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విదేశాలకు నగదు తరలింపు, అవినీతి తదితర రెండు డజన్లకు పైగా ఆయన పై అభియోగాలు నమోదవ్వడం తో అక్కడి అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం బెయిల్ పై బయటకి వచ్చారు కూడా. ఈ నేపధ్యంలో ఆయన భార్య రోస్ మహ్ మన్సూర్ ను కూడా 4 గంటల పాటు విచారించిన అధికారులు అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.