అమెరికా లో కాల్పుల మోత…..ఒక పోలీస్ మృతి!

వాస్తవం ప్రతినిధి: అమెరికా లో మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఓ ఆగంతకుడు ఏడు మంది పోలీసులపై కాల్పులు జరిపాడు. అయితే ఆ కాల్పుల్లో ఓ పోలీసు చనిపోగా, మిగతా ఆరుగురు గాయపడినట్లు తెలుస్తుంది. ఫ్లోరెన్స్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలను బంధీగా తీసుకున్న ఆ ఆగంతకుడిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆగంతకుడు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఫ్లోరెన్స్ ఘటన పట్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. అలానే మృతి చెందిన పోలీసు కుటుంబానికి ట్రంప్ తన సానుభూతి ప్రకటించారు. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 23 వేల 408 మంది పోలీసులు సర్వీసులో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ సంఖ్య 112గా ఉన్నట్లు ఆఫీసర్ డౌన్ మెమోరియల్ పేజ్‌లో ఉంది.