చెస్ ఒలింపియాడ్ లో భారత్ కు సన్నగిల్లిన పతక అవకాశాలు

వాస్తవం ప్రతినిధి: చెస్ ఒలింపియాడ్ లో భారత పురుషుల, మహిళల జట్లకు పతకం గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.  జార్జియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్‌లో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోగా, మరోపక్క భారత మహిళల జట్టు ఇటలీతో జరిగిన మ్యాచ్‌ లో 2–2తో ‘డ్రా’ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.