శబరిమల ఆలయ ప్రవేశం పై సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ వేయనున్న కాంగ్రెస్

వాస్తవం ప్రతినిధి:  ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ రివ్యూ పిటిషన్‌ వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితాల శుక్రవారం నిరాహార దీక్షకూడా చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు దీనిపై ట్రావెన్‌కోర్‌ మాజీలతో ఈ రోజు సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం‌ బోర్డు‌(టీడీబీ) అధ్యక్షులు, మాజీ సభ్యులు, గురువాయూరు, కొచ్చి దేవస్థానం బోర్డు సభ్యులందరూ కలిసి ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్‌కు సంబంధించి తుది నిర్ణయానికి వస్తారు.