ముజఫూర్ పూర్ అత్యాచారాల కేసులో మరో అస్థిపంజరాన్ని కనుగొన్న సీబీఐ అధికారులు

వాస్తవం ప్రతినిధి: బీహార్‌లోని ముజఫూర్‌పూర్‌లో వసతి గృహంలో మైనర్‌లపై అత్యాచారాలు జరగడం తో దేశం తీవ్ర సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంచలన కేసు విచారణ లో సిబిఐ మరో అస్థిపంజరాన్ని కనుగొంది. ఈ కేసులో అరెస్టైయిన నిందితుడు బ్రిజేష్‌ టాకూర్‌ డ్రైవర్‌ను విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 40మంది బాలికలు అత్యాచారానికి గురవ్వగా, ఒక బాలికను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కాల్చివేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. సిబిఐ బృందం ఫోరెన్సిక్‌ నిపుణులతో పాటు ఆ ప్రాంతానికి చేరుకుని త్రవ్వకాలు చేపిట్టినట్లు అధికారులు తెలిపారు. బ్రిజేష్‌టాకూర్‌ విచారణ నిమిత్తం రిమాండ్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రోజీరాణీ, ఆసంస్థ సిబ్బంది గుడ్డు, విజరు, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. టాకూర్‌కు చెందిన 20 బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు.