బతుకమ్మ చీరల పంపిణీ పై ఈసీ పునరాలోచించాలి: ఎంపీ వినోద్

వాస్తవం ప్రతినిధి: బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీ పునరాలోచించుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందాల్సిన చీరెల పంపిణీని ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎంపీ స్పందిస్తూ….. బతుకమ్మ చీరలు ఇప్పటికే కొన్ని జిల్లాలకు చేరుకున్నాయని, దీనితో చీరల పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఎంపీ వినోద్ ఈసీ ని కోరుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయమే అంతిమమని, నిర్ణయం తప్పదంటే తప్పకుండా పాటిస్తామని ఆయన పేర్కొన్నారు.