బీజేపీ “పద్మవ్యూహం”…లోకేష్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా..?

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ని ఆయన తనయుడు ఏపీ ఐటీ శాఖామంత్రిని వదిలే ప్రసక్తి లేదంటూ వదల బొమ్మాలి అంటూ వెంట పడుతోంది బీజేపీ..చంద్రబాబు గుడిలో లింగాన్ని మిగిస్తే..ఆయన తనయుడు గుడినే మిగేసే టైప్ అంటూ తండ్రీ కొడుకులపై విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే విడిచిపెట్టే సమస్యలేదంటూ తెగ ఆరాటపడుతున్నారు. అయితే త్వరలో ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ కోర్టు మెట్లు ఎక్కడ ఖాయం అంటున్నారు బీజేపీ నేతలు. సరే అసలు లోకేష్ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాలి రీజన్ ఏమిటి అంటే.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతటి అభివృద్ధి జరిగిందో గ్రామ గ్రామలో ఉండే రోడ్లని చూస్తె చాలు తెలుసిపోతుంది అయితే నూతన రాజధాని మొదలు పోలవరం, సీసీ రోడ్లు, ప్రభుత్వ పధకాలు ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల అవినీతి తాండవం చేస్తోంది అయితే ఈ క్రమంలోనే ఏపీ ఐటీ శాఖ పరిదిలోనే అత్యంత పెద్ద కుంభకోణం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి అయితే ఇప్పటివరకూ ఆరోపణలకి పరిమితం అయిన బీజేపీ పార్టీ ఇప్పుడు ఏకంగా ఆరోపణలకి బదులు కోర్టులలోనే నేరుగా తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అంతేకాదు

ఏపీ మంత్రులలో కొంతమందిపై కూడా కేసులు కోర్టుల ద్వారా కేసులు పెట్టించే పనిలో పడింది..అయితే ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు బీ.వీ.ఎల్.నరసింహారావు వెల్లడించారు..అయితే లోకేష్ పై బీజేపీ కోర్టుల ద్వారా ఏ ఏ విషయాలని రాబట్టాలని అనుకుంటోంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీల పేరుతో జరుగుతున్న కోట్లాది రూపాయల కుంభకోణాలపై కోర్టులకి వెళ్లి బాబు కొడుకుల లెక్క తెల్చాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది..

అమరావతి లో వివిధ కంపెనీలకి ప్రోత్సాహకాల పేరుతో షెల్ కంపెనీలు సృష్టించారని వీటిని అడ్డం పెట్టుకుని బాబు గారి పుత్రుడు  కోట్లాది రూపాయల  కుంభకోణానికి పాల్పడ్డాడని ప్రధాన ఆరోపణ...ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయడానికి గడచిన నాలుగేళ్లలో విడుదలైన జీవోలను పరిశీలిస్తే తెలుస్తుందని జీవిఎల్ అంటున్నారు...ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు రాకపోయినా – ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల రూపాయలు దండుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైనే ప్రధానంగా కోర్టును ఆశ్రయించాలన్నది జీవీఎల్ నరసింహారావు ప్రధాన ఉద్దేశ్యం.

అయితే జీవీఎల్ ప్రధానంగా మరొక  ఆరోపణ చేస్తున్నారు అదేంటంటే… ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూములను నామమాత్రపు ధరలకు ఇవ్వడమే కాకుండా మూడు సంవత్సరాల తర్వాత వీటిని అమ్ముకోవడానికి కూడా వీలు కల్పించారన్నది ప్రధాన ఆరోపణ...దీని ద్వారా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునే వీలు కల్పించే అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ అని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు...అయితే ఇంతటి వెసులుబాటు అసలు ఎందుకు ఆయా కంపెనీలకి కల్పించారు..ఈ కేటాయిపులు వెనుకాల అసలు ఎన్ని కోట్ల అవినీతి జరిగింది అనేది తేల్చాలని కోర్టులకి ఎక్కనున్నారట..దాంతో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ బాబులకి దినదినగండంలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.