మూర్తి మరణం విద్యారంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: టీడీపీ ఎమ్మెల్సీ, గీతమ్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి మరణం విద్యారంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటని చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికాలో రొడ్డు ప్రమాదంలో మరణించిన మూర్తి మృతి పత్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా మూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమన్న బాబు.. విద్యావేత్తగా, విద్యాదాతగా మూర్తి చెరగని ముద్ర వేశారన్నారు. గాంధీజీ పేరుతో గీతం సంస్థను స్థాపించి వేలాది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. . రోడ్డు ప్రమాదాల్లోనే టీడీపీ నేతలను కోల్పోవడం కలిచి వేస్తోందని బాబు అన్నారు. మరోవైపు.. మూర్తి మృతితో విశాఖలోని టీడీపీ శ్రేణులు తీవ్ర షాక్‌కు గురయ్యాయి.