‘విజయ్ దేవరకొండ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు’ అంటున్న కొరటాల

వాస్తవం సినిమా: యూత్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఆ జాబితాలో కొరటాల శివ ఉన్నాడనే విషయం నిన్న ‘నోటా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ‘పెళ్లి చూపులు’ సినిమా వచ్చినప్పటి నుంచి విజయ్ దేవరకొండ కోసం కథను రెడీ చేయాలనుకుంటున్నాను. కానీ ఆయన విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ ఏ తరహా కథను సిద్ధం చేయాలనే విషయంలో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అన్నారు. మంచి స్క్రిప్ట్ తో త్వరలోనే విజయ్ దేవరకొండను కలుస్తాను’ అని చెప్పారు. దాంతో చిరంజీవి ప్రాజెక్టు తరువాత కొరటాల చేయనున్న సినిమా విజయ్ దేవరకొండతోనేనని అంతా అనుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘నోటా’ రెడీ అవుతోంది. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ను పూర్తి చేసే పనిలో పడనున్నాడు. ఈ సినిమా కాకుండా ఆల్రెడీ ఆయన చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయట.