జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి

వాస్తవం ప్రతినిధి: మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితర ప్రముఖులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీకి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మహనీయుడు అని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ కూడా గాంధీకి నివాళులర్పించారు. గుజరాత్‌ సబర్మతి ఆశ్రమంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.