విజయనగరం వైయస్ ఆర్ సీపీ అభ్యర్థి ని ప్రకటించిన జగన్

వాస్తవం ప్రతినిధి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరంలో జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు – ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి సంచలనం సృష్టించారు.
పాదయాత్రలో భాగంగా మొదట కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వర్గీయ చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి పేరు ప్రకటించి ప్రత్యేకతను చాటుకున్న జగన్ తాజాగా విజయనగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయనగరం వైయస్ ఆర్ సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయనను ఈ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అని, గెలిపించాలని విజయనగరంలో జరిగిన సభలో జగన్ కోరారు. ‘వీరభద్రస్వామి మంచివారు, సౌమ్యుడు.. ఆయన మంచి చేస్తారనే నమ్మకం నాకుంది.. మీ అందరి చల్లని దీవెనలు ఆయనపై, పార్టీపై , నా పై ఉండాలని కోరుతున్నా…’ అని జగన్ వీరభద్రస్వామి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

ఈ నియోజకవర్గంలో 2004 నుంచి వరసగా పోటీ చేస్తూ వస్తున్నారు వీరభద్రస్వామి. 2004లో ఆయన చివరిగా నెగ్గారు. విజయనగరంలో సభ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, ఆయన భార్య తదితరులు వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.