తమిళనాడులో ఘోరం.. మృతదేహానికి మూడురోజులపాటు చికిత్స

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో అచ్చం ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ అయ్యింది.మృత దేహానికి మూడురోజులపాటు చికిత్స చేసిన ఘటన తాజగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం..

నాగపట్నం జిల్లా కీళాయిసానూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శేఖర్ (55) అనారోగ్యంతో ఈ నెల 7న ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం క్షీణించడంతో మరునాడే తంజావూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ముందుగానే రూ.2.50 లక్షలు ఇస్తేనే చికిత్స చేస్తామని ఆస్పత్రి వైద్యులు ముక్కుపిండి మరీ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అనంతరం 28వరకూ కూడా శేఖర్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు శేఖర్ బంధువులు రెడీ అయ్యారు. కానీ చికిత్స చేశామని.. రూ.5 లక్షలు కట్టాలని ఆస్పత్రి యాజమాన్యం పట్టుబట్టింది. దీంతో హామీ పత్రం రాసిచ్చి తంజావూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మూడురోజుల క్రితమే శేఖర్ చనిపోయాడని నిర్ణారించారు.