సరళీ కరణ మంత్రంతో యోగ సాధనకు మొగ్గు చూపుతున్న సౌదీ యువరాజు

వాస్తవం ప్రతినిధి: కఠినమైన ఇస్లామిక్‌ మత విధానాలతో కొనసాగుతున్న సౌదీ అరేబియాలో యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పఠిస్తున్న సరళీకరణ మంత్రంతో ‘యోగ’ సాధనకు ప్రాచుర్యం లభిస్తోంది. సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా యోగాకు అధికారిక గుర్తింపు లేనప్పటికీ యువరాజు సల్మాన్‌ పగ్గాలు చేపట్టిన తరువాత మాత్రం అక్కడ పరిస్థితులలో దాదాపు చాలా మార్పులు వచ్చాయి. గత నవంబర్‌లో దీనిని ఒక క్రీడగా గుర్తించటంతో పాటు యోగ శిక్షణా కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఒకవైపు యోగా ప్రాచుర్యం విస్తరిస్తున్నప్పటికీ సౌదీ మహిళలకు కరుడుగట్టిన మతవాదుల నుండి అవమానాలు, బెదిరింపులు మాత్రం తప్పటం లేదు.