ఫుట్ బాల్ లో నెగ్గిన ధోనీ టీమ్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ కెప్టెన్ క్రికేటరే కాదు అంతకు ముందు ఫుట్ బాల్ గోల్ కీపర్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క క్రికెట్ నే కాదు ఫుట్ బాల్ లో కూడా మంచి గోల్ కీపర్ ని, ఒక మంచి సారధి గా రాణించి మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. ఆదివారం ముంబయిలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రముఖ అమెరికన్‌ గాయకుడు, ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త నిక్‌ జొనాస్‌, ధోనీ జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌లో బాలీవుడ్‌ ప్రముఖులు ఆదిత్య రాయ్‌ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌, కునాల్‌ ఖేము తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్‌ వీక్షించేందుకు ప్రియాంక చోప్రా, ధోనీ సతీమణి సాక్షి కూడా వచ్చారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ జట్టు గెలిచింది. నిక్‌కు ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టమట. ఆట ఆడుతున్నప్పుడు ఒకానొక సమయంలో నిక్‌ కిందపడి గాయపడ్డారు. అయినప్పటికీ ఆటను కొనసాగించారు. ధోనీకి కూడా క్రికెట్‌తో పాటు ఈ క్రీడ పట్ల ఎంతో ఆసక్తి ఉంది. సమయం కుదిరినప్పుడల్లా ముంబయి స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు కూడా వెళుతూ ఉంటారు.