“శంకర్” డైరక్షన్ లో…“మహేష్ బాబు”

వాస్తవం సినిమా: శంకర్ ఈ పేరు సినిమా ఇండస్ట్రీ లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేని పేరు..ఎంతో మంది నటీనటులు శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలో ఒక్క పాత్ర అయినా దక్కితే చాలు అనుకుంటారు ఎంతో మంది హీరోలు శంకర్ సినిమాలో హీరోగా నటిస్తే చాలు అనుకుంటారు అలా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న తమిళ దర్శకుడు శంకర్..శంకర తీసిన సినిమాలు ఇప్పటి వరకూ ఎంతటి సెన్సేషన్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..

జెంటిల్ మెన్ నుంచి రాబోయో రోబో 2.0 వరకు ఆయన చిత్రాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతీ చిత్రంలో సోషల్ మెసేజ్ తప్పకుండా ఉంచుతాడు శంకర్..లంచం తీసుకోవడం..ఇవ్వడం తప్పు అని ‘భారతీయుడు’ సినిమాని అలాగే విద్యా విధానం విద్య అమ్ముకోవడం ఇలాంటి విషయాలని ప్రస్తావిస్తూ జెంటిల్ మెన్.. కార్పోరేట్ కళాశాలలు డబ్బున్న వాళ్లకే కాదు సామాన్యులకు సైతం అందే విధంగా చూసే ఓ ఎన్ ఆర్ ఐ పాత్రలో రజినీకాంత్ నటించి ‘శివాజీ’ ఇలా ఎన్నో సినిమాలు సమాజానికి ఉపయోగపడేలా చిత్రీకరించారు అయితే..

ఇప్పుడు తెలుగు స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తో ఒక డిఫరెంట్ కధతో ఒక చిత్రాన్ని తెరకెక్కించ బోతున్నారు అనే వార్త సినిమా వర్గాలలో చక్కర్లు కొడుతోంది..ప్రస్తుతానికి శంకర్ భారతీయుడు సినిమా సీక్వెల్ లో బిజీ బిజీ గా ఉండటంతో ఈ సినిమా అవ్వగానే మహేష్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం తీయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం…ఈ ప్రాజెక్టు కూడా వందలకోట్ల బడ్జెట్ లోనే టాక్ వినిపిస్తోంది అయితే ఈ సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుందని అంటున్నాయి సినిమా వర్గాలు..