రూ.637 కోట్ల నీరవ్ ఆస్తుల జప్తు

వాస్తవం ప్రతినిధి: పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13 వేల కోట్ల మేరకు తొకరా పెట్టి భారీ మోసానికి పాల్పడిన  ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ .. నీరవ్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు రూ. 637 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. భారత్, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్సులతో పాటు తదితర ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన వివిధ ఆదేశాల మేరకు నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.