చంద్రబాబు కి అక్టోబర్ గ్రహణం..దాడులు తప్పవా..??

వాస్తవం ప్రతినిధి: కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి సిద్దమయిన సమయంలో తెలంగాణలో మహాకూటమి కట్టి అసలు సిసలు రాజకీయాలని బీజేపీ , టీఆర్ఎస్ కి రుచి చూపించాలని అనుకున్నారు మహాకూటమి పార్టీ నేతలు…ఈ కూటమిలో ముఖ్యంగా కేసీఆర్ బీజేపీ పై ముందస్తుగా మండిపడేది చంద్రబాబు నాయుడు ఒకరైతే మరొకరు కాంగ్రెస్ పార్టీ..అయితే కూటమి కట్టడం ద్వారా తప్పకుండా కేసీఆర్ గెలుపుకి వ్యూహాత్మకంగా బ్రేక్ వేసే అవకాశం ఉండటంతో అలెర్ట్ అయిన కేసీఆర్ బీజేపీ పెద్దలకి ఒక దెబ్బకి రెండు పిట్టలు కధ చెప్పడంతో వారు కూడా ఒకే చెప్పేశారట.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ‘రేవంత్‌రెడ్డి’ ఇంటిపై, బంధువుల ఇంటిపై ఐటి దాడులు జరగడం వెనుక బీజేపీ కేసీఆర్ కలిసి ఆడిన రాజకీయ వ్యూహంగా ఇప్పటికే అర్థం అవుతూ ఉంది..అయితే అయితే ఇదే తరహ దాడులు ఇప్పుడు చంద్రబాబు పై కూడా జరిగేలా బీజేపీ కేసీఆర్ తో కలిసి వ్యుహాలని రచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అంటూ కధనాలు కోకొల్లలుగా వస్తున్నాయి..

గడిచిన నాలుగు రోజులగా “రేవంత్‌రెడ్డి” ఇంటిపై దాడులు చేసిన ఐటి అధికారులు..ఆయనను పలు రకాలుగా ప్రశ్నలు సంధించారని ఆ సమయంలో చంద్రబాబు ఓటుకు నోటు విషయంలో కీలక ప్రశ్నలకి సమాధానాలు రాబట్టారని తెలుస్తోంది..ఇప్పుడు రేవంత్ ఇచ్చిన సమాచారంతోనే త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై కూడా ఐటీ సోదాలు కేంద్రం అండదండలతో జరుగనున్నాయని తెలుస్తోంది

అక్టోబర్ 3వ తేదీన ‘రేవంత్‌రెడ్డి’ని అరెస్టు చేస్తారని..ఆయనతో పాటు ఓటుకు నోటు కేసులో ఉన్న సెబాస్టియన్‌ ఇతరులను కూడా అరెస్టు చేస్తారని భోగట్టా….ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రూ.50లక్షలు ఎవరవని ఇప్పటికే ఐటి అధికారులు ‘రేవంత్‌రెడ్డి’ని ప్రశ్నించారు..అయితే అసలు రేవంత్ పై ఐటీ దాడుల లక్ష్యం చంద్రబాబు అని సమాచారం అందుతోంది..అయితే ముందుగా తెలంగాణలో రేవంత్ అరెస్ట్ అయితే ఆ తరువాత ఏపీలో చంద్రబాబు పై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నారట..ఈ క్రమంలో ఒకే కేసుతో అటు తెలంగాణలో రేవంత్ దూకుడుకి ఇటు ఏపీలో చంద్రబాబు దూకుడుకి కళ్ళెం వేసి ఒక దెబ్బకి రెండు పిట్టలని సైలెంట్ గా ఉంచేలా వ్యుహాలని సిద్దం చేస్తోందట బీజేపీ. మరి ఈ కధనంలో వాస్తవం అంతో తెలియదు కాని మొత్తానికి బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ని ఏపీలో బాబు ని అధికారంలోకి రానివ్వకుండా బీజేపీ భారీ ప్లాన్ వేస్తోందని అంటున్నారు విశ్లేషకులు .